Bus Accident Case | కర్నూలు బస్ ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. వీ కావేరి ట్రావెల్ యజమాని వేమూరి వినోద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను పోలీసులు కోర్టులో హాజరుపరిచిన పోలీసులు.. ఆ తర్వాత రిమాండ్‌కు తరలించారు. ప్రమాద ఘటనపై వీ కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్, యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో ఏ1 డ్రైవర్ ల్మణ్ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల కర్నూలులో రోడ్డు ప్రమాదానికి గురైంది.
ఆ తర్వాత మంటలు చెలరేగి అందులో ఉన్న ప్రయాణికులు పలువురు సజీవదహనమయ్యారు. అక్టోబర్ 24 న కర్నూలు వద్ద హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వీ కావేరి ట్రావెల్ బస్సు చిన్న టేకూరు వద్ద ప్రమాదానికి గురైంది. 19 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు డ్రైవర్‌ను అరెస్టు చేయగా.. యజమాని పరారయ్యారు. తాజాగా యజమానిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బస్సు ప్రమాదంపై కల్లూరు మండలం ఉల్లిందకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.