Srisailam | కుమారస్వామికి కృత్తిక నక్షత్ర పూజలు.. భ్రామరికి ఊయల సేవ
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో శుక్రవారం కుమారస్వామికి కృతికా నక్షత్ర పూజలు, భ్రామరికి శాస్త్రోక్తంగా ఊయల సేవ నిర్వహించారు.
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు జరిపిస్తున్నట్లు దేవస్థానం ఈవో ఎస్ లవన్న తెలిపారు. శుక్రవారం ఉదయం గ్రామదేవత అంకాలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత భక్తులకు అంకాలమ్మ దర్శనం ఇచ్చారు. ఇక కృత్తికా నక్షత్రాన్ని పురస్కరించుకుని కుమారస్వామికి అభిషేకాలు, షోడషోపచార పూజాధి క్రతువులు నిర్వహించారు.

శుక్రవారం సాయంత్రం శ్రీ భ్రమరాంబ అమ్మవారికి ప్రీతికరమైన గులాబి, గన్నేరు, దేవగన్నేరు, నందివర్ధనం, గరుడవర్థనం, మల్లెలు, చామంతులతో పుష్పాలంకరణ చేశారు. అటుపై స్వామి అమ్మవార్లకు ఊయలసేవ చేశారు. ఈ సందర్భంగా ఊయలలో స్వామి అమ్మవార్లను వేంచేబు చేసి సేవా మహా సంకల్పాన్ని పఠించారు. అష్టోత్తరం,త్రిశతి, ఖడ్గమాల, లలితా సహస్త్ర నామాలతో షోడశోపచార క్రతువులు నిర్వహించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

