King Cobra | అమరావతి : నాగుపాము పేరు విన్నా.. దాన్ని ప్రత్యక్షంగా చూసినా గుండెల్లో వణుకు పుడుతోంది. అలాంటిది ఓ పోలీసు కానిస్టేబుల్ తన సీటు కింద నాగుపాము ఉన్నప్పటికీ అలాగే నడిపించాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి పరిధిలో పాయకరావుపేటలో వెలుగు చూసింది.
పాయకరావుపేటకు చెందిన కానిస్టేబుల్ శివాజీ రోజు మాదిరిగానే తన బైక్పై విధులకు బయల్దేరాడు. బైక్పై వేగంగా వెళ్తుండగా తన సీటు కింద నుంచి మార్గమధ్యలో ఏదో వింత శబ్దం వినిపించింది. దీంతో అప్రమత్తమైన శివాజీ తన ద్విచక్ర వాహనాన్ని సడెన్గా ఆపాడు. అనంతరం సీటు తెరిచి చూడగా నాగుపాము బుసలు కొడుతూ కనిపించింది. పడగవిప్పి కాసేపు అందర్నీ తీవ్ర భయాందోళనకు గురి చేసింది నాగుపాము. మొత్తానికి స్థానికుల సాయంతో ఆ నాగుపామును అక్కడ్నుంచి కానిస్టేబుల్ తరిమేశాడు. అనంతరం విధులకు వెళ్లాడు శివాజీ.