అమరావతి : దివంగత సీఎం ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి(Lakshmi Parvati) ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ జయంతి (NTR Anniversary) సందర్భంగా ఆమె హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో నివాళి అర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ఎన్టీఆర్ స్ఫూర్తితో పరిపాలన కొనసాగుతుందని, వైఎస్ జగన్ (YS Jagan) కు ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయని అన్నారు. జూన్ 4న వెలువడే ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీలో సుభిక్షపాలన, శాంతియుతమైన పాలన అందుకుంటుందని, వైఎస్ జగన్కు ఎన్టీఆర్ ఆశీస్సులు నిండుగా అందాలని కోరుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు.