తిరుమలలో మూడురోజులపాటు జ్యేష్ఠాభిషేకం
జ్యేష్ఠాభిషేకం| ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ ఆలయం తిరుమల శ్రీవారి క్షేత్రంలో మూడు రోజులపాటు జ్యేష్ఠాభిషేకం నిర్వహించనున్నారు. ఏటా ఈ కార్యక్రమాన్ని జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠా నక్షత్రానికి ముగిసేలా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల22 నుంచి 24 వరకు జ్యేష్ఠాభిషేకం కార్యక్రమం జరగనుంది.

తిరుమల: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ ఆలయం తిరుమల శ్రీవారి క్షేత్రంలో మూడు రోజులపాటు జ్యేష్ఠాభిషేకం నిర్వహించనున్నారు. ఏటా ఈ కార్యక్రమాన్ని జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠా నక్షత్రానికి ముగిసేలా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల22 నుంచి 24 వరకు జ్యేష్ఠాభిషేకం కార్యక్రమం జరగనుంది. అభిషేకాలతో శ్రీవారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఉత్సవం సందర్భంగా ఆలయంలో ఈనెల 24న వర్చువల్ ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలను టీటీడీ రద్దు చేసింది.
ఇందులో భాగంగా మొదటిరోజు మలయప్పస్వామికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి హోమాలు, అభిషేకాలు, పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం వజ్రకవచం అలంకరించి మాడవీధుల్లో ఊరేగిస్తారు. రెండోరోజు ముత్యాల కవచ సమర్పణచేసి ఊరేగింపు నిర్వహిస్తారు. చివరిరోజైన 24న తిరుమంజనాదులు పూర్తిచేసి బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగించనున్నారు. ఈ బంగారు కవచాన్ని మళ్లీ వచ్చే ఏడాది జ్యేష్టాభిషేకంలోనే తీస్తారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

