అమరావతి : పట్టిసీమను వట్టిసీమ అని వ్యాఖ్యనించిన వైఎస్ జగన్(YS Jagan) పట్టిసీమ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు (AP Minister Nimmala) డిమాండ్ చేశారు. గురువారం గుంటూరు జిల్లా ఉండవల్లి వద్ద డెల్టా ప్రధాన రెగ్యులేటర్ (Delta main regulator ) వద్ద కృష్ణమ్మకు పూజలు చేసి రెగ్యులేటర్ గేట్లను తెరచి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అత్యంత అవసరమైన తాగు, సాగునీటిని(Irrigations) నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. 365 రోజులు ఇసుక, భూములు, మద్యం, గనుల దోచుకోవడంపై దృష్టిపెట్టి ప్రజా సంక్షేమం గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. అందుకు భిన్నంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రతి చుక్క నీరును ఒడిసిపట్టుకుని ప్రతి ఎకరాకు నీరందించే లక్ష్యంతో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వానికి ప్రాధాన్యత రంగాల గురించి తెలియకపోవడంతో రాష్ట్రంలోని ఇరిగేషన్ రంగాన్ని సర్వనాశనం చేశారని మంత్రి పార్థసారథి (Minister Parthasarathi) దుయ్యబట్టారు. 2.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే చింతలపూడి ప్రాజెక్టును పట్టించుకోకపోవడం వల్ల ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు బీళ్లుగా మారుతున్నాయని ఆరోపించారు. దీనివల్ల తాగునీటిలో ఫ్లోరైడ్ సమస్య ఉత్పన్నమవుతుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అధికారులు పాల్గొన్నారు.