అమరావతి : వైసీపీ (YCP) పాలనలో రైతు గురించి జగన్ ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదని, రైతు అనే మాట ఉచ్ఛరించే అర్హత అతనికి లేదని టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy ) ఆరోపించారు. నెల్లూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతు ఆత్మహత్యల్లో (Farmers Suicide) రాష్ట్రాన్ని మొదటి స్థానానికి తీసుకెళ్లిన ఘటన జగన్‌ది అని విమర్శించారు.
వ్యవసాయ శాఖను చంపేసి, రైతులకు ప్రోత్సహకాలు దూరం చేశారని, వ్యవసాయ శాఖపై శ్వేతపత్రం (White Paper) విడుదలకు తాము సిద్ధం, జగన్ సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. నీటి పారుదల రంగాన్ని నిర్వీర్యం చేశారని , ప్యాలెస్‌లో గోళ్లు గిల్లుకుంటూ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని మండిపడ్డారు. ఏనాడైనా వ్యవసాయశాఖపై జగన్ సమీక్ష నిర్వహించారా ? కూటమి పాలనంలో ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే 48 గంటల్లోనే డబ్బులు రైతుల అకౌంట్లలో జమ అవుతున్నాయని అన్నారు.
ఐదేండ్ల జగన్ పాలనలో రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి వాటిని అక్రమంగా విదేశాలకు పంపి కోట్లు గడించారని ఆరోపించారు. రైతుల సమస్యలపై పోరుబాట చేసే హక్కు మీకెక్కడిదని ప్రశ్నించారు. పట్టిసీమ వల్ల కొన్ని సంవత్సరాల పాటు కరువు ప్రాంతాలకు కృష్ణ నీళ్లిచ్చామని పేర్కొన్నారు.