Warning | మంత్రి రోజాకు మరోసారి టికెట్ ఇస్తే పనిచేయం.. నియోజకవర్గ నేతల హెచ్చరిక
Warning | ఆంధ్రప్రదేశ్ టూరిజం, క్రీడల శాఖ మంత్రి రోజా(Minister Roja) పై ఆమె అనుచరులు మండిపడుతున్నారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ టూరిజం, క్రీడల శాఖ మంత్రి రోజా(Minister Roja) పై ఆమె అనుచరులు మండిపడుతున్నారు. ఆమెకు టికెట్ ఇవ్వొద్దని వైసీపీ(YCP) అధిష్టానానికి మంగళవారం విజ్ఞప్తి చేశారు. నగరి నియోజకవర్గానికి చెందిన ఐదు మండలాల వ్యతిరేక వర్గం నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించి నియోజకవర్గంలో రోజాకుకాకుండా మరెవరికైనా టికెట్(Ticket) ఇవ్వాలని కోరారు.
రెండు సార్లు పార్టీ, అభ్యర్థి రోజాను గెలిపించుకునేందుకు అహర్శిశలు, శక్తివంచన లేకుండా పనిచేశామని తెలిపారు. ఐరన్ లెగ్(Iron leg) పేరున్న రోజాను నియోజకవర్గ వైసీపీ నాయకులంతా గోల్డెన్ లెగ్ గా మార్చామని పేర్కొన్నారు. అయితే నియోజకవర్గంలో ఆమె సోదరులు చేస్తున్న దోపిడికి(Looting) అడ్డుగా ఉన్నామనే అక్కసుతో మమ్మల్ని దూరంగా పెట్టి వేధిస్తున్నారని వడమాలపేట జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, పుత్తూరు నేత అమ్ములు, లక్ష్మీపతిరాజు, మండలాల వైసీపీ నాయకులు ఆరోపించారు.
వ్యతిరేకవర్గం నేతలు ఎవరైనా సరే అవినీతి పాల్పడి ఉంటే దానిపై రోజాతో చర్చకు సిద్దమని సవాల్ విసిరారు. వైసీపీ అధికారంలోకి రాకముందు అప్పుల్లో ఉన్న రోజా మంత్రి అయ్యాక ఎంత సంపాదించిందో అందరికీ తెలుసని విమర్శించారు. పుత్తూరు( Puttoor) నగరిలో ఎక్కడ చూసినా భూ కబ్జాలు, దౌర్జన్యాలు, దోపిడీలు జరుగుతున్నాయని మండిపడ్డారు. మంత్రి రోజాకు మరోసారి వైఎస్ఆర్ అధిష్టానం సీటు ఇస్తే తాము పనిచేయాబోమని స్పష్టం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

