తిరుమల : పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదం(Laddu Pradadam) లో పొగాకు పొట్లం ఉన్నట్లు, కొంతమంది భక్తులు సోషల్ మీడియాలో వైరల్ చేయడం భావ్యం కాదని టీటీడీ (TTD) ఈవో శ్యామలారావు తెలిపారు. తిరుమలలోని లడ్డు పోటులో వైష్ణవ బ్రాహ్మణులు అత్యంత భక్తిశ్రద్ధలతో, నియమ నిష్ఠలతో, శ్రీవారి లడ్డూలను ప్రతిరోజు లక్షలాదిగా తయారు చేస్తారని ఆయన పేర్కొన్నారు.
లడ్డూల తయారీ కూడా సీసీటీవీ(CC TV) ల పర్యవేక్షణలో ఉంటుందని, ఇంతటి పకడ్బందీగా లడ్డులు తయారు చేసే వ్యవస్థలో ఈ విధంగా పొగాకు ఉన్నట్లు ప్రచారం చేయడం శోచనీయమని పేర్కొన్నారు.
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది . ఆపదమొక్కలవాడని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కేవలం ఒక్క కంపార్టుమెంట్లో మాత్రమే భక్తులు వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 65,604 మంది భక్తులు దర్శించుకోగా 24,266 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.85 కోట్ల ఆదాయం(Income) వచ్చిందని వెల్లడించారు.