హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు (PSR Anjaneyulu) అరెస్ట్ అయ్యారు. ముంబై నటి కాందాంబరి జెత్వానీ కేసులో ఏపీ సీఐడీ అధికారులు మంగళవారం ఉదయం హైదరాబాద్లోని బేగంపేటలోని ఆయన నివాసంలో అదుపులోకితీసుకున్నారు. అనంతరం విజయవాడకు తరలిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆంజనేయులు పని చేశారు. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు.
ఇదే కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారులు క్రాంతి రాణా టాటా, విశాల్ గున్నీ నిందుతులుగా ఉన్నారు. అయితే వారిద్దరి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆంజనేయులు మాత్రం ఇప్పటివరకూ బెయిల్ కోసం అప్పీల్ చేసుకోకపోవడం గమనార్హం. కాగా, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై థర్డ్ డిగ్రీ కేసులో కూడా ఆయన నిందితుడిగా ఉన్నారు.