తిరుమల : శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారికి రేపటి నుంచి 28వ తేదీ వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని శుక్రవారం అధికారులు ఆహ్వానించారు.ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, అర్చకులు బాలాజీ, సూపరింటెండెంట్ ముని చెంగలరాయులు తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో చైర్మన్ ను కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు.
అదేవిధంగా నాగలాపురం మండలం సురుటుపల్లి లోని శ్రీపల్లి కొండేశ్వర స్వామి వారికి ఈనెల 21 నుంచి మార్చి 3వ తేదీ వరకు నిర్వహించే శివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు టీటీడీ చైర్మన్ ను ఆహ్వానించారు.