అమరావతి : ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరం(Gannavaram) , విశాఖపట్నం (Visaka) ఎయిర్‌పోర్టులో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికుల ముందు జాగ్రత్తగా పలు విమానాలను సమీప ఎయిర్‌పోర్టుకు(Airports) దారి మళ్లించారు. దట్టమైన పొగమంచు కారణంగా విమానాల ల్యాండింగ్ తీవ్ర అంతరాయాలు ఏర్పడ్డాయి. ఎయిర్‌పోర్టు అధికారుల నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో పలు విమనాలు గాలిలోనే చక్కర్లు కొట్టాయి.
బెంగళూరు, మద్రాస్ నుంచి వచ్చిన విమానాలకు వాతావరణం అనుకూలించకపోవడం, ల్యాండింగ్‌కు అధికారుల నుంచి అనుమతి రాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీ నుంచి విశాఖ విమానాన్ని భువనేశ్వర్ వైపు, హైదరాబాద్-విశాఖ, బెంగళూరు -విశాఖ విమానాలను హైదరాబాద్ వైపు మళ్లించినట్లు ఎయిర్‌పోర్టు డైరెక్టర్ రాజారెడ్డి తెలిపారు.