హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం చైర్మన్ బీఆర్నాయుడు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణం చేపట్టనున్నట్టు చెప్పారు. తిరుపతిలోని శ్రీపద్మావతి చిన్న పిల్లల హృదయాలయం లో అత్యాధునిక సౌకర్యాలు కల్పించేందుకు అదనంగా రూ.48 కోట్ల మం జూరుకు ఆమోదం తెలిపినట్టు పేర్కొన్నారు.
టీటీడీకి రూ.60 లక్షల విరాళం
శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు లక్షల విరాళం అందింది. బెంగుళూరుకు చెందిన కేఎన్ నయన, బీ ప్రభ, రాజేశ్, కేఎన్ రాజేశ్, గుంటూరుకు చెందిన దేవరశెల్లి రితీశ్, దేవరశెట్టి సత్యనారాయణ వేర్వేరుగా రూ.10 లక్షల చొప్పున విరాళం అందజేశారు.