అమరావతి : ఎన్టీఆర్ జిల్లా నందిగామ డివిజన్ పరిధిలో 2 లక్షల 43 వేల మద్యం సీసాలను ఆబ్కారీ అధికారులు ధ్వంసం చేశారు. వాటి విలువ రూ.5 కోట్ల 47 లక్షలు ఉంటుందని పేర్నొన్నారు. డివిజన్ వ్యాప్తంగా మొత్తం 6075అక్రమ మద్య కేసులు కాగా పట్టుకున్న మద్యం సీసాలను ఆయా పోలీసుస్టేషన్లలో భద్రపరిచారు .
వీటిని ఇవాళ అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో రోడ్ రోలర్ ద్వారా మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమంగా ఏపీకి తరలిస్తుండగా పట్టుబడిన మద్యం విలువ రూ.5.5 కోట్లుగా ఉంటుందని విజయవాడ సీపీ వెల్లడించారు. పెనుగంచిప్రోలు మండలం తోటచెర్ల వద్ద ప్లాట్లలో పోలీస్ కమిషనర్ క్రాంతి రాణ టాటా, డీసీపీ మేరి ప్రశాంతి సమక్షంలో మద్యం సీసాలను ధ్వంసం చేశారు.