అమరావతి : తమ డిమాండ్లను కూడా పరిష్కరించకపోతే ఈనెల 6న అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు సమ్మెకు వెళ్తామని ఏపీ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక వెల్లడించింది. ఈమేరకు ఈ రోజు 45 సమస్యలతో కూడిన మెమోరాండాన్ని ఆర్టీసీ ఎండీకి అందజేశారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు వెళ్తామని ఆర్టీసీ ఎన్ఎంయూ, ఈయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ కార్మిక పరిషత్ నాయకులు పేర్కొన్నారు.