Srisailam | శ్రీశైలం భ్రమరాంబదేవి అమ్మవారికి హైదరాబాద్ వాసి నాగోజీ వెంకటేశ్వర కుమార్, శివ కుమారి దంపతులు మంగళవారం బంగారం హారాన్ని సమర్పించారు. మామిడి పిందెల డిజైన్ తో రూపొందించిన ఈ హారాన్ని దేవస్థానం ఈఓ డీ పెద్దిరాజుకు వెంకటేశ్వర కుమార్, శివ కుమారి దంపతులు అందజేశారు. ముత్యాలు, ఎర్రరాళ్లు, పచ్చరాళ్లు, తెల్ల రాళ్లతో కూడిన బంగారం హారం మొత్తం 120 గ్రాములు ఉంటుంది. ఈ సందర్భంగా వెంకటేశ్వర కుమార్- శివకుమారి దంపతులకు స్వామి వారి శేష వస్త్రాలు, ప్రసాదాలు, సంబంధిత రశీదు అందజేశారు. దాతలు వెంకటేశ్వర కుమార్ – శివకుమార్ మాట్లాడుతూ ఈ హారం విలువ రూ.8.35 లక్షలు ఉంటుందని తెలిపారు.
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను గోవా ఆరోగ్య శాఖామంత్రి విశ్వజిత్ పి రాణే, విజయవాడ ఏపీ ఎస్పీఎఫ్ డీజీపీ త్రివిక్రమ్ వర్మ దర్శించుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున శ్రీకృష్ణ రాయ గోపురం వద్దకు చేరుకున్న వీరికి ఈవో పెద్దిరాజు, ఏఈఓ శ్రీనివాసరావు అర్చక వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో గోవా ఆరోగ్య శాఖామంత్రి విశ్వజిత్ పి రాణే, విజయవాడ ఏపీ ఎస్పీఎఫ్ డీజీపీ త్రివిక్రమ్ వర్మలకు అర్చక వేద పండితులచే వేద ఆశీర్వచనం చేయించి శేష వస్త్రాలు లడ్డు ప్రసాదం జ్ఞాపికలను అందించారు. ఈ కార్యక్రమంలో ఈవోతో పాటు ఏఈవోలు, హరిదాస్, శ్రీనివాస రావు, శ్రీశైలం వన్ టౌన్ సిఐ ప్రసాద్ రావులు పాల్గొన్నారు.
Hyundai Exter CNG | సీఎన్జీ వేరియంట్లో ఎక్స్టర్ హెచ్‌వై-సీఎన్జీ.. రూ.8.5 లక్షల నుంచి షురూ..!
MG Motor CUV EV | టాటా కర్వ్.ఈవీకి పోటీగా ఎంజీ సీయూవీ ఈవీ.. లాంచింగ్ ఎప్పుడంటే..?!
Realme GT 6T | కొత్త కలర్ ఆప్షన్ లో రియల్ మీ జీటీ 6టీ.. 20 నుంచి సేల్స్ షురూ..!
iQoo Z9 Lite 5G | ఐక్యూ నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ జడ్9 లైట్ 5జీ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Kia EV6 | 1138 ఈవీ6 కార్లను రీకాల్ చేస్తున్న కియా.. కారణమిదేనా..?!