అమరావతి : విజయవాడలోని (Vijayawada) విద్యాధరపురం గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో (Exhibition) భారీ అగ్నిప్రమాదం (Fire Incidents) చోటు చేసుకుంది. బుధవారం మధ్యాహ్నం ఎగ్జిబిషన్‌లోని ఒక స్టాళ్లలో వంట చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలింది. దీంతో మంటలు వ్యాపించి పక్కనున్న స్టాళ్లకు అంటుకున్నాయి. భారీగా అగ్నికీలలు ఎగిసిపడడంతో మూడు ఫైర్‌ఇంజిన్లతో మంటలు ఆర్పేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కశ్మీర్ జలకన్య పేరుతో గత కొన్ని రోజులుగా విజయవాడలో ఎగ్జిబిషన్లో కొనసాగుతుంది. ఈ ప్రమాదంలో స్టాళ్లు.. ఫర్నిచర్ దహనమయ్యాయి.