అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో హౌరా ఎక్స్‌ప్రెస్ ( Howrah Express ) రైలుకు పెను ప్రమాదం తృటిలో తప్పింది. గూడురు రైల్వే జంక్షన్ పరిధిలోని తిరుపతి( Tirupati ) జిల్లా అడవయ్యకాలనీ ప్రాంతంలో రైలు పట్టాలు విరిగిన విషయం గమనించిన స్థానికులు రెడ్ క్లాత్ద్వారా లోకోపైలట్ ( Loco Pilot ) ను అప్రమత్తం చేశారు. దీంతో గమనించిన లోకోపైలట్ రైలును నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది.
రైల్వే సిబ్బంది హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతు చేయడంతో గంటపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లె వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నంద్యాల నుంచి గుంటూరు వైపు గూడ్స్‌రైలు వెళ్తుండగా జరిగిన ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి.