తిరుమల : తిరుమల (Tirumala) అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి( Venkaiah Chowdhary ) నారాయణ గిరి షెడ్లను శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. యాత్రికులకు భోజన, పాలు సకాలంలో అందుతున్నాయా అనే అంశంపై భక్తులను అడిగి తెలుసుకున్నారు. శ్రీవారి సేవకులు భక్తులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు.
చలికాలం కావడంతో వేడి పాలు (Hot Milk) నిరంతరాయంగా అందజేయాలని అధికారులను ఆదేశించారు. తగిన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేటట్లుగా చూడాలన్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్-2లో వేచి ఉన్న భక్తులకు వీలైనంత త్వరగా దర్శనం చేయిండానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.