కడప పేలుడు ఘటన.. కొనసాగుతున్న ఉన్నతస్థాయి కమిటీ విచారణ
కొనసాగుతున్న ఉన్నతస్థాయి కమిటీ విచారణ | ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె గనిలో ఈ నెల 8న జరిగిన పేలుడు ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ విచారణ కొనసాగుతున్నది.

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె గనిలో ఈ నెల 8న జరిగిన పేలుడు ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ విచారణ కొనసాగుతున్నది. బుధవారం పేలుడు జరిగిన ప్రాంతాన్ని కమిటీ సభ్యులు పరిశీలించారు.
ముగ్గు గనిలో పేలుళ్లు జరిగి 10 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తూ ఏపీ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి 5 ప్రభుత్వశాఖలతో ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. కడప జిల్లా సంయుక్త కలెక్టర్ (రెవెన్యూ) ఆధ్వర్యంలో మైనింగ్, రెవెన్యూ, పోలీస్, మైన్స్, భదరత, పేలుళ్ల నియంత్రణశాఖకు చెందిన అధికారులు కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
శుక్రవారం ఈ కమిటీ తన విచారణ నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది. ఇప్పటికే గనిని లీజుకు తీసుకున్న వ్యక్తి నాగేశ్వర రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మృతుల కుటుంబాలకు తక్షణ నష్టపరిహారం కింద ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు, గాయపడిన వారికి రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

