తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. పెరటాసి మాసం, వరుస సెలవులతో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయ వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 1, 5 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుంది. రోజుకు సుమారు 80 వేల మంది సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నప్పటికి రోజు ముగిసే సరికి అదనంగా మరో 30 వేల మంది భక్తులు దర్శనం కోసం నిరీక్షిస్తున్నారు.
దీంతో సామాన్య భక్తులు మరుసటి రోజు దర్శనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. సెప్టెంబర్ 30, అక్టోబర్ 4న సిఫార్సు లేఖల స్వీకరణను రద్దు చేశారు. రద్దీ దృష్ట్యా టీటీడీ నిర్ణయానికి సహకరించాలని అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేశారు.