Srisailam Project | శ్రీశైలం : ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతున్నది. జలాశయం 10 క్రస్ట్ గేట్లను 18 అడుగుల మేర ఎత్తి సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల డ్యామ్ గేట్లద్వార 3,22,129 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 10,663 క్యూసెక్కులు.. సుంకేసుల నుంచి 1,33,100 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 1,125 క్యూసెక్కుల నీరు విడుదలై సాయంత్రానికి 4,78,092 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో రిజర్వాయర్‌కు చేరుతోంది.
అదే విధంగా కుడి, ఎడమ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 65,507 క్యూసెక్కులు, 10 గేట్లు ద్వారా 4,19,790 క్యూసెక్కులు మొత్తంగా 4,85,297 క్యూసెక్కులు అవుట్ ఫ్లో రిలీజ్ నాగార్జున సాగర్ వైపు వెళ్తుందని అధికారులు వివరించారు. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881.80 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 197.9120 టీఎంసీల నిల్వ ఉంది. జలాశయం గేట్ల ఎత్తుడంతో పెద్ద ఎత్తున పర్యాటకులు జలాశయం అందాలను చూసేందుకు తరలివస్తున్నారు. శ్రీశైలం కృష్ణమ్మ పరవళ్లు చూపరులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.