అంజనాద్రే హనుమంతుడి జన్మస్థానం
హనుమంతుడి జన్మస్థానం | కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమలక్షేత్రం ఇకపై హనుమంతుడి జన్మస్థానంగానూ గుర్తింపు పొందనున్నది.

పూర్తి వివరాలతో త్వరలో టీటీడీ పుస్తకం
హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమలక్షేత్రం ఇకపై హనుమంతుడి జన్మస్థానంగానూ గుర్తింపు పొందనున్నది. 13న ఉగాది రోజున ఈ విషయాన్ని శాస్త్రీయఆధారాలతో నిరూపించేందుకు టీటీడీ సిద్ధమైంది. గురువారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఈవో కేఎన్ జవహర్‌రెడ్డి ఈ విషయంపై నిపుణుల కమిటీ సభ్యులతో సుదీర్ఘంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. కమిటీలోని పండితులు జ్యోతిషశాస్త్రం, శాసనాలు, పురాణాలు శాస్త్రీయఆధారాలతో ఉగాదిరోజున ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేస్తారని వివరించారు. హనుమంతుడి జన్మస్థానం అంజనాద్రి అని నిరూపించేందుకు ఉన్న ఆధారాలు, ఇతర వివరాలతో త్వరలో పుస్తకాన్ని తీసుకొస్తున్నట్టు తెలిపారు. అంజనాద్రి కొండలో హనుమంతుడు జన్మించాడనే విషయాన్ని ఆధారాలతో సహా నిరూపించేందుకు 2020 డిసెంబర్లో టీటీడీ పండితులతో కమిటీని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ శివ, బ్రహ్మ, బ్రహ్మాండ, వరాహ, మత్స్యపురాణాలు, వేంకటాచల మహత్యం గ్రంథం, వరాహమిహిరుడి బృహత్సంహిత గ్రంథాల ప్రకారం వేంకటేశ్వరస్వామి చెంతన ఉన్న అంజనాద్రి కొండే ఆంజనేయుడి జన్మస్థానమని.. యుగం, తేదీ ప్రకారం నిర్ధారణకు వచ్చారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
Jobs | రైల్వేలో 1688 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల.. సికింద్రాబాద్ జోన్లో 72 పోస్టులు
Y.S. Jagan | ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు.. ఖండించిన వైఎస్ జగన్
Farmers Protest | మోటార్లు తొలగించాలన్న ఆదేశాలకు నిరసనగా రైతుల ఆందోళన
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

