Kodali Nani | ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఆదివారం విజయవాడ ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. రూ.300కోట్లకుపైగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు 14 రోజుల పాటు రిమాండ్‌ను విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏసీబీ కోర్టు ఆదేశాల అనంతరం.. మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. దేవుడి ముందు ఎవరూ తప్పించుకోలేరని, ఇది చంద్రబాబు విషయంలో నిజమైందని నాని పేర్కొన్నారు. చంద్రబాబు తనయుడు లోకేశ్ ఇప్పటికైనా సినిమా డైలాగ్స్‌ను మానేయాలని హితవు పలికారు. స్కామ్ చంద్రబాబును సీఎం జగన్ జైలుకు పంపిన విషయాన్ని సైతం లోకేశ్ తన రెడ్‌బుక్‌లో రాసుకోవాలని సెటైర్లు వేశారు. అదే సమయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై సైతం సెటర్లు వేశారు. చంద్రబాబును అరెస్టు చేయగానే.. అసలు పుత్రుడి కంటే.. దత్త పుత్రుడి హడావిడి ఎక్కువైందంటూ విమర్శించారు.