Gokulashtami | సెప్టెంబరు 7న తిరుచానూరు శ్రీకృష్ణస్వామి ఆలయంలో గోకులాష్టమి
Gokulashtami | తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీకృష్ణస్వామి ఆలయంలో సెప్టెంబరు 7న గోకులాష్టమి(Gokulashtami) పర్వదినాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నామని ఆలయ అధికారులు వివరించారు.
తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీకృష్ణస్వామి ఆలయంలో సెప్టెంబరు 7న గోకులాష్టమి(Gokulashtami) పర్వదినాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నామని ఆలయ అధికారులు వివరించారు. ఉదయం శ్రీకృష్ణస్వామి మూలవర్లకు అభిషేకం, అర్చన , మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శ్రీ కృష్ణ స్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం (Tirumanjanam), సాయంత్రం స్వామివారికి ఊంజల్సేవను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
రాత్రి 7 నుంచి 8.15 గంటల వరకు స్వామివారు పెద్దశేష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనం (Darsanam) ఇవ్వనున్నారని వివరించారు. రాత్రి 8.30 నుండి 9 గంటల వరకు గోపూజ, గోకులాష్టమి ఆస్థానం కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు.
సెప్టెంబరు 8న ఉట్లోత్సవం సందర్భంగా మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్నపన తిరుమంజనం, ఊంజల్సేవ సాయంత్రం 6.15 నుంచి రాత్రి 7.30 గంటల వరకు స్వామివారికి ఉట్లోత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కారణంగా సెప్టెంబరు 8న ఆలయంలో సహస్ర దీపాలంకరణ సేవను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు (TTD Officers) వివరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

