Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Lover | కాశీవర్దన్ ప్రియురాలైన విజయవాడ పటమటకు చెందిన నాగసౌమ్య అతడికి ఎలాగైనా బెయిల్ ఇప్పించాలనుకుంది. అయితే ఇందుకోసం నాగసౌమ్య తన దగ్గర డబ్బులు లేక డగ్స్ సరఫరా చేస్తూ వచ్చిన డబ్బులు కూడబెడుతోంది.
Lover | తన ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు డబ్బులు సంపాదించేందుకు ఓ ప్రియురాలు డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు దొరికిపోయింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పరిధిలో వెలుగు చూసింది. కాశీవర్ధన్ అనే వ్యక్తి 3 నెలల క్రితం చిత్తూరులో డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కాడు. అయితే కాశీవర్దన్ ప్రియురాలైన విజయవాడ పటమటకు చెందిన నాగసౌమ్య అతడికి ఎలాగైనా బెయిల్ ఇప్పించాలనుకుంది. అయితే ఇందుకోసం నాగసౌమ్య తన దగ్గర డబ్బులు లేక డగ్స్ సరఫరా చేస్తూ వచ్చిన డబ్బులు కూడబెడుతోంది.
నాగసౌమ్య కొందరితో కలిసి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో కృష్ణలంకకు చెందిన బషీర్ రూ.50 వేలు కమిషన్ ఇస్తానని అనడంతో బెంగళూరుకు వెళ్లిన నాగసౌమ్య 110 గ్రాముల ఎండీఎంఏ తీసుకుంది. అనంతరం బెంగళూరు – హౌరా ఎక్స్ప్రెస్లో నాగసౌమ్య తిరిగి విజయవాడ రాగా మాటు వేసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పరారీలో ఉన్న బషీర్ను కూడా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. కాశీవర్ధన్, నాగసౌమ్య ఇద్దరూ డ్రగ్స్ బానిసలుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- AP
- drugs
- Lover
- Vijayawada
RELATED ARTICLES
తాజా వార్తలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

