Srisailam | శ్రీశైల శ్రీ మల్లికార్జున స్వామి వారికి తెలంగాణ జిల్లా గద్వాల వాసి బంగారు నామాలను విరాళంగా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన అనికేత్ సాయి ఈవో శ్రీనివాసరావుకు 68 గ్రాముల బంగారంతో ప్రత్యేకంగా తయారు చేసిన త్రిపుండ్రాల నామాలను ప్రత్యేక పర్వదినాల్లో స్వామివారికి అలంకరించేందుకు విరాళంగా అందజేశారు. దాతకు స్వామి అమ్మవార్ల దర్శనంతో పాటు లడ్డూ ప్రసాదం, స్వామి వారి పరిమళ విభూది, కుంకుమ, శేష వస్త్రాలను అందజేశారు. దాతల వెంట మల్లికార్జున అన్న సత్రం- టీజీ భవన్ అధ్యక్షులు మిడిదొడ్డి శ్యాంసుందర్ ఉన్నారు