తిరుమల : చంద్ర గ్రహణం ( Lunar eclipse ) కారణంగా తిరుమలలో ప్రతి నెలా నిర్వహించే పౌర్ణమి గరుడ సేవ (Garuda Seva) ను ఆదివారం టీటీడీ ( TTD )రద్దు చేసింది. అదేవిధంగా ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను కూడా రద్దు చేశామని సంబంధిత అధికారులు వివరించారు. చంద్రగ్రహణం కారణంగా క్యూలైన్‌ను మూసివేశారు. తిరిగి సోమవారం తెల్లవారుజామున రెండు గంటలకు తిరిగి క్యూలైన్‌ను ప్రారంభిస్తామని చెప్పారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కాగా నిన్న స్వామివారిని 82,118 మంది భక్తులు దర్శించుకోగా 32,118 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.97 కోట్లు వచ్చిందని తెలిపారు.