గుంటూరు: ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) ఖాతాలను ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణలపై గుంటూరులోని ఈపీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో పలువురు అధికారులపై సీబీఐ కేసులు నమోదు చేసింది. గుంటూరు, విజయవాడ, ఒంగోలు, చీరాల, గుంటుపల్లిలో ఈపీఎఫ్ అధికారులకు చెందిన 40 నివాసాలు, ఇతర ప్రాంతాల్లో సీబీఐ విస్తృతంగా సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నది.
ఈపీఎఫ్ అధికారులు కొందరు ప్రైవేట్ కన్సల్టెంట్లతో కుమ్మక్కయ్యారని, క్లెయింలు, సర్వీసులు, ఉద్యోగుల బకాయిల చెల్లింపుల్లో పలు అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ గుర్తించింది. గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే వంటి మొబైల్ వాలెట్ల ద్వారా భారీగా ముడుపులు తీసుకున్నట్లు ఆధారాలను కూడా సేకరించారు. ఈపీఎఫ్ అధికారులపై అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన సీబీఐ అధికారులు వారిపై నాలుగు కేసులు నమోదు చేసింది.