ఏలూరులోని పోరస్ ఫ్యాక్టరీ శాశ్వతంగా మూతపడింది. ఈ మేరకు ఫ్యాక్టరీ యాజమాన్యం ఫ్యాక్టరీ ముందు ఓ బ్యానర్‌ను కట్టింది. ప్రభుత్వ ఆదేశాల మేరకే మూతపడిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే కేవలం బ్యానర్ కడితే సరిపోదని, ఇక మళ్లీ తెరవొద్దని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామస్థులు చేస్తున్న ఆందోళనకు వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు తమ మద్దతు ప్రకటించాయి.
పోరస్ ఫ్యాక్టరీలో బుధవారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. రియాక్టర్ పేలడంతో ఐదుగురు సజీవ దహనమయ్యారు. మరొకరు మాత్రం ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మృతి చెందారు. ఇక ప్రభుత్వం మరణించిన వారి కుటుంబ సభ్యులకు 25 లక్షల పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు యాజమాన్యం కూడా 25 లక్షల పరిహారాన్ని ప్రకటించింది.