AP News | టీడీపీలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే అప్పల నాయుడు
AP News | విజయనగరం జిల్లా నెల్లిమర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే బడుకొండ అప్పల నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, హోంమంత్రి అనిత సమక్షంలో టీడీపీలో చేరారు.
అమరావతి : విజయనగరం జిల్లా నెల్లిమర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే బడుకొండ అప్పల నాయుడు ( Appala Naidu ) టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, హోంమంత్రి అనిత సమక్షంలో టీడీపీ ( TDP ) లో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ సిద్ధాంతాలు, కూటమి పరిపాలన విధానాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు అప్పలనాయుడు ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, కూటమి నాయకుల ఆదేశాల మేరకు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి తన వంతు పాటుపడతానని వివరించారు. కాగా అప్పలనాయుడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు బంధువు కావడం విశేషం. ఇటీవల బొత్స ముఖ్య అనుచరుడు, బంధువు మజ్జి శ్రీనివాస్ టీడీపీలో చేరారు. అతడికి సమీప బంధువు అప్పలనాయుడు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ ఈనెల 2న తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం అప్పలనాయుడు పై సస్పెన్షన్ వేటు వేసినట్లు ప్రకటన విడుదల చేసింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | టీడీపీలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే అప్పల నాయుడు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ సెంచరీ.. ఇండియా టార్గెట్ 260
మద్దూరును కరువు మండలంగా ప్రకటించాలి.. మండల సభను బహిష్కరించిన సర్పంచులు
Eetha Trailer | ‘ఛావా’ దర్శకుడి కొత్త సినిమా.. శ్రద్ధా కపూర్ ‘ఈఠా’ ట్రైలర్ విడుదల!
‘పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

