అమరావతి : బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు(Nandigam Suresh) మంగళగిరి కోర్టు రెండువారాల రిమాండ్(Remand) విధించింది. అతడికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం గుంటూరు జైలుకు తరలించే అవకాశముంది. మంగళగిరిలోని తెలుగుదేశం (TDP) పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేయడంతో రెండు రోజుల క్రితం విచారించిన కోర్టు బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. తనను అరెస్టు చేస్తారన్న సమాచారం నేపథ్యంలో ఆయన తన మొబైల్‌ను స్విచ్ఛాప్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లారు. దాంతో పోలీసులు కొంత సేపటి వరకు వేచి చూసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా బుధవారం ఉదయం ఎక్కడ ఉన్నారనే కోణంలో ఆరా తీశారు.
దాంతో ఆయన హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలియడంతో ప్రత్యేక బృందం హైదరాబాద్‌కు వెళ్లి అదుపులోకి తీసుకు మంగళగిరికి తరలించారు. తెలుగుదేశం పార్టీపై దాడి కేసులో వైఎస్సార్సీపీ నేతలు దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్‌తో పాటు పలువురు అజ్ఞాతంలోకి వెళ్లారు. వారి కోసం గుంటూరు, బాపట్ల జిల్లాలకు చెందిన 12 పోలీసుల బృందాల వారి ఆచూకీ కోసం గాలిస్తున్నాయి.