Vizag | వేరే అమ్మాయితో ఎఫైర్.. భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న మాజీ మిస్ వైజాగ్
Vizag | తన భర్త తనకే కావాలంటూ మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర పోరాటానికి దిగింది. తనకు విడాకులు ఇవ్వకుండానే మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఆందోళనకు దిగింది. ఈ క్రమంలోనే మరో యువతితో ఉండగా భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. తనను అన్యాయం చేస్తున్నారని భర్తను.. అతనితో ఉన్న యువతిపై దాడికి దిగింది. తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ఎదుట నిరసన దీక్షకు చేపట్టింది.
Vizag | తన భర్త తనకే కావాలంటూ మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర పోరాటానికి దిగింది. తనకు విడాకులు ఇవ్వకుండానే మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఆందోళనకు దిగింది. ఈ క్రమంలోనే మరో యువతితో ఉండగా భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. తన కాపురంలో చిచ్చుపెట్టిందని సదరు యువతిని చితకబాదింది. అడ్డొచ్చిన భర్త చెంప కూడా చెళ్లుమనిపించింది. అనంతరం తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ఎదుట నిరసన దీక్షకు చేపట్టింది.
వివరాల్లోకి వెళ్తే..
నక్షత్ర 2012లో మిస్ వైజాగ్‌గా ఎంపికైంది. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించి. అదే సమయంలో త్రిపురనేని సాయి వెంకట తేజ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొంతకాలం ప్రేమించుకున్న తర్వాత 2017లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప కూడా ఉంది. అయితే పెళ్లయిన తర్వాత కొన్నాళ్లకు ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే మరో అమ్మాయితో తేజ సంబంధం పెట్టుకున్నాడు. అంతేకాకుండా ఆమెను పెళ్లి చేసుకుని కాపురం కూడా పెట్టాడు.
భర్త వేరే మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న మిస్ వైజాగ్ నక్షత్ర.. న్యాయం కోసం పోరాటం
వైజాగ్‌లో నక్షత్ర(మిస్ వైజాగ్) తన భర్త తేజ వేరే మహిళతో ఉండగా మీడియాతో వెళ్లి పట్టుకుంది.. తనకు విడాకులు ఇవ్వకుండా మరో మహిళతో కాపురం పెట్టాడని తనకు న్యాయం చేయాలని మిస్ వైజాగ్ నక్షత్ర తన… pic.twitter.com/OtdCgySqsG
— Telugu Scribe (@TeluguScribe) May 30, 2024
ఈ విషయం తెలుసుకున్న నక్షత్ర గురువారం ఉదయం.. విశాఖలోని దసపల్లా హిల్స్‌లోని ఓ అపార్ట్మెంట్లో తన భర్త ఉంటున్న ఫ్లాట్‌కు వెళ్లింది. అక్కడ వేరే అమ్మాయితో తన భర్త ఉండటాన్ని గుర్తించింది. పరాయి అమ్మాయితో తన భర్త ఉండటాన్ని చూసి తట్టుకోలేని నక్షత్ర ఆ అమ్మాయిపై దాడికి దిగింది. భర్త చెంప కూడా చెళ్లుమనిపించింది. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు కూడా వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఫ్లాట్‌లో ఉన్న అమ్మాయిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు కుమార్తెతో కలిసి నిరసనకు దిగింది. ఈ క్రమంలో ఆవేదన చెందిన నక్షత్ర.. తన భర్త గురించి అసలు విషయాలను బయటపెట్టింది. పబ్జీ గేమ్ ఆడి చాలామంది అమ్మాయిలను తేజ ట్రాప్ చేశాడని తెలిపింది. తాను అందంగా ఉండటంతో చాలామంది అమ్మాయిలు తనతో శారీరక సంబంధాల కోసం ఇష్టపడుతున్నారని తనకే చెప్పాడని పేర్కొంది. తనకు రోజుకో అమ్మాయి కావాలని ఒత్తిడి తీసుకొచ్చేవాడని సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఇదిలా ఉండగా.. తనపై నక్షత్ర తప్పుడు కేసులు పెట్టిందని ఆమె భర్త తేజ ఆరోపిస్తున్నాడు. కేసు కోర్టులో ఉందని.. అక్కడే తేల్చుకుంటానని తెలిపాడు. తనతో ఉన్న అమ్మాయి ఆడిషన్స్ కోసమే వచ్చిందని స్పష్టం చేశాడు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

