Ambati Rambabu | టీడీపీకి ఓ చట్టం.. వైసీపీకి ఒక చట్టమా? : కూటమిని ప్రశ్నించిన మాజీ మంత్రి అంబటి
Ambati Rambabu | ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు వేర్వేరుగా చట్టాలు అమలు అవుతున్నాయని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.
అమరావతి : ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు వేర్వేరుగా చట్టాలు అమలు అవుతున్నాయని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu ) ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో (Social Media) అసభ్యకరంగా పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులు, కార్యకర్తల మీద తప్పుడు కేసులు బనాయిస్తున్నారని పేర్కొన్నారు.
వైఎస్ జగన్ (YS Jagan) , ఆయన సతీమణి భారతీపై, మాజీ మంత్రులపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసిన టీడీపీ నాయకులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. టీడీపీకి (TDP) ఒక చట్టం, వైసీపీకి ఒక చట్టమా అంటూ నిలదీశారు. పోలీసులు తమ ఫిర్యాదులపై ఎందుకు స్పందించడం లేదని అన్నారు. గౌరవప్రదమైన పోస్టులో ఉన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా వైసీపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు రాంగోపాల్ వర్మ, నటుడు పోసాన కృష్ణ మురళిపై అనామకులు ఫిర్యాదు చేయగానే వెంటనే కేసులు నమోదు చేశారని ఆరోపించారు. చట్టాలను ఉల్లంఘిస్తున్న పోలీసులపై చర్యలకు న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని అంబటి స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ తీరును ప్రజలు గమనించాలని కోరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

