అమరావతి : నెల్లూరు జిల్లాలోని ఓ కర్మాగారంలో గ్యాస్ లీకై ఐదుగురు కూలీలు అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని పంటపాలెం పంచాయతీలోని ఓ కర్మాగారంలో బిహార్‌కు చెందిన ఓ కార్మికుడు బాయిలర్ సమీపంలోని బావిలో దిగి పనులు పరిశీలిస్తుండగా గ్యాస్ లీకై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతడి కాపాడేందుకు మరో నలుగురు బావిలో దిగారు. వారు కూడా అస్వస్థతకు గురయ్యారు.
వెంటనే స్పంధించిన సహచర కార్మికులు మరికొందరు వారిని రక్షించి బాధితులను నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు ప్రాణాపాయం లేదని ప్రకటించారు. సంఘటనపై విచారణ చేస్తున్నామని, ఎవరికి ఎలాంటి ప్రాణహాని లేదని ఎస్సై శివరామకృష్ణ తెలిపారు.