అమరావతి : ఏపీలోని నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఓ సినిమా థియేటర్లో ( Movie theater) అగ్నిప్రమాదం (Fire) చోటు చేసుకుంది. దీంతో ముందు జాగ్రర్త చర్యగా ప్రేక్షకులు థియేటర్ నుంచి పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
పట్టణంలోని స్రవంతి థియేటర్లో బుధవారం సినిమా ప్రదర్శన జరుగుతుండగా ప్రొజెక్టర్ రూమ్లో మంటలు చెలరేగాయి. దీంతో థియేటర్లో సినిమా చూస్తున్న ప్రేక్షకుల్లో ఆందోళన మొదలైంది. ఒక్కసారిగా దట్టమైన పొగ వ్యాపించడంతో ప్రేక్షకులు అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విద్యుదాఘాతంతోనే ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.