విశాఖపట్నం శివారులోని ఓ గోదాములో మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో గోదాములోని ఫర్నీచర్, పరుపులు కాలి బూడిదయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మంటలను ఆర్పేందుకు విశాఖ నుంచి అగ్నిమాపక వాహనాలు తరలివచ్చాయి.
విశాఖపట్నం గాజువాక శివారులోని వడ్లపూడిలో ఉన్న ఓ గోదాములో ఆదివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మంటలు అంటుకుని గోదాములో భద్రపరిచిన ఫర్నీచర్, పరుపులు, ఇతర వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. మంటల కారణంగా ధట్టమైన పొగలు వ్యాపించాయి. పొగలను గమనించిన స్థానికులు పోలీసులు, ఫైర్ స్టేషన్కు సమాచారామిచ్చారు. మంటలను ఆర్పేందుకు రెండు ఫైరింజన్లు గాజువాక నుంచి వచ్చాయి. వారు మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో ఎంత విలువైన ఫర్నీచర్, పరుపులు ఆహుతయ్యాయనేది, నష్టం ఎంత అనేది తెలియాల్సి ఉన్నది. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.