అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో (AP Secretariat) అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున సెక్రటేరియట్‌లోని రెండో బ్లాక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బ్యాటరీలు ఉంటే ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. గుర్తించిన ఎస్పీఎఫ్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
రెండో బ్లాక్‌లోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, హోం మంత్రి అనితల పేషీలు ఉన్నాయి. అయితే ఈ ఘటన ప్రమాద వశాత్తు జరిగిందా లేదా కుట్ర కోణం ఏమైనా ఉందా అనే కోణం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.