Fire Accident | హ్యుందాయ్ కార్ల షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు..!
Fire Accident | విజయవాడలోని ఆటోనగర్‌లో ఉన్న హ్యుందాయ్ కార్ల షోరూంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం షోరూంకు సెలవు కావడంతో పెను ప్రాణనష్టం తప్పింది. భవనం పైఅంతస్తు నుంచి పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. వివరాల్లోకి వెళ్తే.. ఆటోనగర్‌లోని హ్యుందాయ్ షోరూం భవనం పైభాగం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Fire Accident : విజయవాడలోని ఆటోనగర్‌లో ఉన్న హ్యుందాయ్ కార్ల షోరూంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం షోరూంకు సెలవు కావడంతో పెను ప్రాణనష్టం తప్పింది. భవనం పైఅంతస్తు నుంచి పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. వివరాల్లోకి వెళ్తే.. ఆటోనగర్‌లోని హ్యుందాయ్ షోరూం భవనం పైభాగం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
క్షణాల్లోనే మంటలు భవనం పైఅంతస్తును పూర్తిగా చుట్టుముట్టాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా కమ్ముకోవడంతో సమీప నివాసితులు, వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖకు, పోలీసులకు సమాచారం అందించారు. హూటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది పలు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు.
ఆదివారం సెలవు కావడంతో షోరూంలో సిబ్బంది గానీ, వినియోగదారులుగానీ ఎవరూ లేరు. ఇదేరోజు పనిదినం అయ్యుంటే ఊహించని స్థాయిలో ప్రాణనష్టం జరిగి ఉండేదని అధికారులు అభిప్రాయపడ్డారు. భవనం పైఅంతస్తులో సంభవించిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాదం కారణంగా భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత నష్టంపై పూర్తిస్థాయిలో అంచనా వేయనున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, అగ్నిమాపక శాఖ అధికారులతో కలిసి ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్‌కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

