అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి రోజా సెల్వమణి (Minister Roja) కి అమరావతి మహిళలు నుంచి నిరసన సెగ తగలింది. జై అమరావతి అంటూ రోజాముందు నినాదాలు చేశారు. తిరుమల (Tirumala)లో వేంకటేశ్వరాస్వామిని దర్శించుకున్న అనంతరం ఆలయం బయటకు వచ్చిన మంత్రికి శ్రీవారి సేవకుల నుంచి నిరసన ఎదురయ్యింది. ఆమె చుట్టూ చేరి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.
రాష్ట్రానికి ఒక్కటే రాజధాని ఉండాలని, అది అమరావతి ఉండాలని పేర్కొంటూ నినాదాలు చేశారు. మంత్రి కూడా జై అమరావతి నినాదాలు చేయాలని పట్టుబట్టారు. చివరకు రోజా శ్రీవారి వద్ద ఇదేమి పద్దతని నొచ్చుకుంటు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం (YCP Gogernment) అధికారంలోకి రాగానే మూడు రాజధానులను ప్రకటించారు.
కర్నూలు, విశాఖపట్నంతో పాటు విజయవాడ రాజధానులుగా ఉంటాయని అసెంబ్లీలో తీర్మాణం చేశారు. వీటిపై అమరావతి రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ గత నాలుగు సంవత్సరాల నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.