అమరావతి : దొంగతనం ఏనాడైనా బయటపడుతుందనేది నానుడి. అదే జరిగింది గుంటూరు జిల్లాలో. పుష్ప సినిమాలో (Pushpa style ) మిల్క్ ట్యాంకర్లో అరను ఏర్పాటు చేసి ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేసినట్లుగానే మద్యం ( Liquor ) సరఫరాకు ప్రయత్నించిన ముగ్గురిని పోలీసులు కటకటాలకు పంపారు.
గుంటూరు (Guntur) కు చెందిన బాలకృష్ణ అనే వ్యక్తి మినీ లారీని కొనుగోలు చేసి అందులో రహస్యంగా మద్యం రవాణా చేయడానికి ప్రత్యేక అరలను తయారు చేశాడు. అనంతరం మరో ఇద్దరి స్నేహితులతో కలిసి పుదుచ్చేరిలో మద్యం కొనుగోలు చేసి తీసి మినీ లారీలో తీసుకువస్తుండగా గుంటూరు -1 ఎక్సైజ్ పోలీసులు గుర్తించి ముగ్గురిని అరెస్టు చేశారు. వాహనంలో తరలిస్తున్న సుమారు రెండు లక్షల రూపాయల విలువ గల మద్యాన్ని పట్టుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించారు.
సినిమా స్టైల్లో మద్యం అక్రమ రవాణా..
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం తుంగపాడు గ్రామానికి చెందిన బాలకృష్ణ మినీ లారీ కొనుగోలు చేసి అందులో రహస్యంగా మద్యం రవాణా చేయడానికి ప్రత్యేక అరలను తయారు చేశాడు.
ఇద్దరి స్నేహితులతో కలిసి పుదుచ్చేరిలో మద్యం కొనుగోలు చేసి తీసుకువస్తుండగా… pic.twitter.com/AEIaNwMzJn— Aadhan Telugu (@AadhanTelugu) January 3, 2025
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మద్యం పాలసీపై ప్రత్యేక చట్టాన్ని రూపొందించి అమలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచే వచ్చే మద్యంతో పాటు గంజాయి, డ్రగ్స్ నివారణపై గట్టి నిఘా ఉంచి తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తనిఖీలు నిర్వహిస్తుండగా గుంటూరు ఎక్సైజ్ సిబ్బందికి పుష్ప స్టైల్లో తరలిస్తున్న అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు.