Perninani | మాజీ మంత్రి పేర్నినాని సంచలన వ్యాఖ్యలు.. నన్ను, కుమారుడిని అరెస్టు చేయవచ్చని అనుమానం
Perninani | గోదాం నుంచి బియ్యం మాయం కేసులో తనను, తన కుమారుడిని జనవరి 2వ తేదీలోగా పోలీసులు అరెస్టు చేయవచ్చని వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమరావతి : గోదాం నుంచి బియ్యం (Rice) మాయం కేసులో తనను, తన కుమారుడిని జనవరి 2వ తేదీలోగా పోలీసులు అరెస్టు చేయవచ్చని వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని ( Perninani ) సంచలన వ్యాఖ్యలు చేశారు. నా భార్యను అరెస్ట్ చేయడానికి ఓ మంత్రి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
తన భార్య పేరిట ఉన్న గోదాం నుంచి బియ్యం మాయం కేసులో తనను ఒక్కరోజైనా జైలులో ( Jail ) పెట్టాలనే ఆలోచన జిల్లాకు చెందిన మంత్రి ఒకరు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తన భార్యను కూడా జైలుకు పంపాలని సీఎం చంద్రబాబు ( Chandra Babu ) దగ్గర ప్రస్తావించినప్పటికీ ఇంట్లోని ఆడవారి జోలికి వెళ్లవద్దని ఆదేశించడం అభినందనీయమని నాని పేర్కొన్నారు.
చంద్రబాబు చెప్పినప్పటికీ వారు ప్రయత్నాలు ఆపడం లేదని కొంత మంది ఎమ్మెల్యేలు, అధికారులు ఇందుకు సాక్ష్యమని పేర్కొన్నారు. నా భార్య జయసుధపై కేసు పెట్టిననాటి నుంచి నేటి వరకు తన కుటుంబాన్ని అరెస్టుకు మంత్రి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
2వ తేదీన తమ గోదాం మేనేజర్ క్వాష్ పిటిషన్ విచారణ ఉంది. ఆలోగా నన్ను, నా కుమారుడిని పోలీసులు అరెస్టు చేయవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తమ రాజకీయాలు, కక్ష సాధింపు కోసం ఇంట్లోని ఆడవాళ్ల జోలికి రావడం బాధాకరమని ఆయన అన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nikeelu Gunda | సూపర్ ఏఐ అకాడమీ ఫౌండర్ నికీలు గుండాకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
100 Feets Master Plan Road | మేం కష్టపడి కట్టుకున్న స్కూల్ పోతుంది.. 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై బాధిత మహిళ
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

