వైసీపీ ఎమ్మెల్యే, తాజా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి నిర్వహిస్తున్న గడప గడపకూ కార్యక్రమం అన్న ప్రోగ్రాంను శ్రేణులందరూ విజయవంతం చేయాలని మాజీ మంత్రి అనిల్ కుమార్ పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే కోటంరెడ్డి నిర్వహిస్తున్న కార్యక్రమానికి సంఘీభావం తెలపడానికే తాను ఇక్కడికి వచ్చానని, అందులో ఎలాంటి రాజకీయం లేదని మాజీ మంత్రి అనిల్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కోటంరెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందాలని తాను కోరుకుంటున్నట్లు అనిల్ ప్రకటించారు. అయితే వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు? అన్నది మాత్రం బయటికి రానివ్వడం లేదు.