అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు సమస్యను జటిలం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పీఆర్సీ అమలు విషయంలో గత రెండు వారాలుగా ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఆందోళనలతో పాటు రేపటి నుంచి తలపెట్టిన సహాయ నిరాకరణ, 7నుంచి సమ్మె తదితర వాటిపై ఆయన స్పందించారు. ఉద్యోగులను చర్చలకు వచ్చి సమస్యను తెలియజేయాలని పదేపదే కోరుతున్నా ఉద్యోగులు స్పందించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.
ఉద్యోగ సంఘాల నేతలు ఏం చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదని పేర్కొన్నారు. ఉద్యోగులు వస్తే ఇప్పటికీ చర్చలకు సిద్ధమేనని స్పష్టం చేశారు. నిన్న విజయవాడలో నిర్వహిం చిన ఉద్యమంలో రాజకీయ పార్టీలు, అసాంఘిక శక్తులు కూడా పాల్గొన్నాయని ఆయన ఆరోపించా రు. రాజకీయ పార్టీలు ఎంటరైతే ఉద్యోగులకే సమస్య వస్తుందని పరోక్షంగా ఉద్యోగులను హెచ్చరించారు.
ఉద్యోగ సంఘాల నాయకులు మాటలు, వాటికి కౌంటర్లు వేస్తూ వెళ్తే అసలు సమస్య దారి మళ్లుతుందని వివరించారు. చర్చలకు మంత్రుల కమిటీ ఓపెన్మైండ్తో రావట్లేదని స్టీరింగ్ కమిటీ నేతలు చెప్పడాన్ని సజ్జల తప్పుబట్టారు.