Eluru student | అమెరికాలో కాల్పులు.. ఏలూరు యువకుడు మృతి
అమెరికాలో తెలుగు యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అగ్రరాజ్యంలోని (USA) ఓహియోలో (Ohio) దుండగులు జరిపిన కాల్పుల్లో (Shot dead) ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు (Eluru) అశోక్‌నగర్‌కు చెందిన వీరా సాయేశ్ (Veera Saiesh) మృతిచెందాడు.
హైదరాబాద్: అమెరికాలో తెలుగు యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అగ్రరాజ్యంలోని (USA) ఓహియోలో (Ohio) దుండగులు జరిపిన కాల్పుల్లో (Shot dead) ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు (Eluru) అశోక్‌నగర్‌కు చెందిన వీరా సాయేశ్ (Veera Saiesh) మృతిచెందాడు. ఎమ్మెస్ (MS) చేయడానికి అమెరికా వెళ్లిన సాయేశ్.. కొలంబస్ (Columbus) ఫ్రాంక్లింటన్‌లోని ఓ షెల్ గ్యాస్ స్టేషన్లో (Shell gas station) పార్ట్‌టై ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 12.50 గంటలకు (భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం) గ్యాస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుండగా ఇద్దరు దుండగులు అతనిపై కాల్పులు జరిపి నగదు ఎత్తుకెళ్లారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సాయేశ్‌ను ఓహియోహెల్త్ గ్రాండ్ మెడికల్ సెంటర్‌కు తరలించారు. అయితే అక్కడి చికిత్స పొందుతు మరణించాడు.
తండ్రి మరణం అనంతరం 2021లో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన సాయేశ్.. ఓహియో స్టేట్ పిన్స్ యూనివర్సిటీలో ఎమ్మెస్ చదువుతున్నాడు. ఇప్పుడిప్పుడే కుటుంబానికి అండగా నిలుస్తున్న ఆయన ప్రస్తుతం చివరి సెమిస్టర్లో ఉన్నాడు. మరో పది రోజుల్లో ఎమ్మెస్ పూర్తికానుంది. ఈనేపథ్యంలో ఇంటికి తిరిగి రావడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలోనే అతడు మృతిచెండటంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొత్త జిల్లాలు.. అభివృద్ధి ఖిల్లాలు
కాలిన మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లతో ఆందోళన
రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం.. కాంగ్రెస్ వచ్చింది ఉయ్యాలో.. కరెంటు పోయింది ఉయ్యాలో..
తెల్లారేలోగా ఊరంతా నేలమట్టం.. అర్ధరాత్రి వేళ.. పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు
కరెంట్ కోసం ఎదురుచూపులే.. కోతలు, లోవోల్టేజీ సమస్యలపై రైతుల ఆందోళనలు.. పలుచోట్ల ధర్నాలు, సబ్స్టేషన్ల ముట్టడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

