తిరుమల : వడ్డీకాసులవాడు, కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల ( Tirumala ) శ్రీనివాసుడికి బెంగుళూరుకు చెందిన కల్యాణ్ రామన్ కృష్ణమూర్తి అనే భక్తుడు ( Bangalore devotee) బుధవారం రూ. కోటి విరాళాన్ని అందజేశారు. ఈ విరాళానాన్ని టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టు అందజేస్తూ టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి డీడీని అందజేశారు.
శ్రీవారికి బంగారు లక్ష్మీ పతకం విరాళం
బెంగుళూరుకు చెందిన మరో భక్తుడు కె.యం.శ్రీనివాసమూర్తి అనే భక్తుడు బుధవారం భోగ శ్రీనివాసమూర్తికి అలంకరించేందుకు రూ.25 లక్షలు విలువైన వజ్రం, వైజయంతి పొదిగిన 148 గ్రాముల బంగారు లక్ష్మీ పతకాన్ని విరాళంగా అందించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకులు మండపంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి ఆభరణాన్ని అందజేశారు.