తిరుపతి : తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి వసంతోత్సవాల్లో ( Padmavati Vasanthosavam,)భాగంగా రెండవరోజు శుక్రవారం పద్మావతి అమ్మవారు స్వర్ణరథం(Golden Chariot) పై ఆశీనులై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ఉదయం వైదిక కార్యక్రమాల అనంతరం అమ్మవారి ఉత్సవ మూర్తిని అర్చకులు స్వర్ణరథంపై ఆశీనురాలిని చేశారు.
భక్తులు తన్మయత్వంతో నాలుగుమాడ వీధుల్లో(Mada Streets) రథాన్ని లాగారు. కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, డిప్యూటీ ఈవో గోవింద రాజన్ తదితరులు పాల్గొన్నారు.