అమరావతి : వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి( YS Jagn) గురువారం నర్సీపట్నంలో పర్యటిస్తున్న సందర్భంగా దళిత సంఘాలు(Dalit groups) నిరసనను చేపట్టాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ( Narsipatnam) లోని వైద్య కళాశాలను సందర్శించడానికి గురువారం ఆయన విశాఖకు చేరుకున్నారు. అక్కడి నుంచి నర్సీపట్నంకు బయలు దేరారు. అయితే నర్సీపట్నం ప్రధాన కూడలిలో దళిత నాయకులు, సంఘాలు మానవహారంగా ఏర్పడి జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మత్తు వైద్యుడు సుధాకర్‌ను వేధింపులకు గురిచేశారని, తీవ్ర మనస్తాపానికి గురై దళిత మేధావి సుధాకర్ ఆత్మహత్య చేసుకున్నాడని దళిత నాయకులు ఆరోపించారు. ఒక దళిత మేధావికి జగన్‌రెడ్డి చేసిన సన్మానం, జగన్‌రెడ్డి ప్రభుత్వంతో పోరాడి అలసిపోయి ఆగిన దళిత గుండే అంటూ డాక్టర్ సుధాకర్(Doctor Sudhakar) ఫొటోలతో ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. జగన్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా స్టీల్‌ప్లాంట్ కార్మికులు వైఎస్ జగన్‌ను కలిసి తమ సమస్యలపై స్పందించాలని కోరారు. అధికారంలో ఉన్న , ప్రతిపక్షంలో ఉన్నా తమది మొదటి నుంచి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉన్నామని స్పష్టం చేశారు. తమ హయాంల అసెంబ్లీ తీర్మానం చేశామని, ప్రధానికి లేఖలు రాసామని, స్టీల్ ప్లాంట్‌పై పార్లమెంట్‌లోనూ ప్రశ్నిస్తామని హామీ ఇచ్చారు.