అమరావతి : కేంద్ర ప్రభుత్వం రూ.2 వేల నోట్ల ( Two thousand notes ) మార్పిడి ( Exchange ) కి విధించిన గడువు సమీపిస్తున్న కొద్ది ఆ నోట్ల మార్పిడికి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అసలు కంటే కొసరు నయమన్నట్లుగా పెద్దమొత్తంలో ఉన్న రూ.2వేల నోట్లను మధ్యవర్తులకు కమీషన్ ఇచ్చి తక్కువ నగదును వసూలు చేసుకుంటున్నారు. ఇలాంటి నోట్ల మార్పిడి విషయంలో జోక్యం చేసుకుని అసలు వ్యక్తులకు మోసం చేసిన ఏఆర్ ఇన్స్పెక్టర్ ( Inspector ) తో పాటు ఇద్దరు హోంగార్డులు, మధ్యవర్తిని పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
విశాఖలో జరిగిన ఘటన వివరాలను విశాఖ పోలీస్ కమిషనర్ త్రివిక్రమవర్మ (Police Commissinor) శుక్రవారం మీడియాకు వెల్లడించారు. రిటైర్డ్ నావెల్ అధికారులు కొల్లి శ్రీను, శ్రీధర్ తమ వద్ద ఉన్న రూ.90లక్షల విలువగల రూ. 2 వేల నోట్లను మార్పిడికి మధ్యవర్తి సూరిబాబును ఆశ్రయించారు. తమకు రూ.90లక్షలు రూ.500 నోట్లు ఇస్తే రూ. కోటి రూ. 2000 నోట్లను ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. నగదు మార్పిడిలో సమస్యలు రావడంతో సూరిబాబు ఇన్స్పెక్టర్ స్వర్ణలత వద్ద హోంగార్డులుగా పనిచేస్తున్న శ్యామ్సుందర్, శ్రీనును ఆశ్రయించారు.
అధిక డబ్బుకు కక్కుర్తిపడ్డ హోంగార్డులు మధ్యవర్తి సూరిబాబును బెదిరించి రూ.10 లక్షల ఒప్పందాన్ని రూ.20 లక్షల వరకు పెంచి వచ్చిన దాంట్లో మొత్తాన్ని నలుగురు పంచుకున్నారు. అసలు వ్యక్తులు కొల్లి శ్రీను, శ్రీదర్ డీసీపీకి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి రావడంతో ఏఆర్ ఇన్స్పెక్టర్, హోంగార్డులు, మధ్యవర్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు.