CPI Ramakrishna | వైసీపీ చేసిన తప్పులే టీడీపీ కూడా చేస్తోంది.. సీపీఐ రామకృష్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
CPI Ramakrishna | ఏపీలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు లాంటి వ్యక్తి సీఎంగా ఉన్న రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఉందని అన్నారు.
CPI Ramakrishna | ఏపీలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు లాంటి వ్యక్తి సీఎంగా ఉన్న రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలని సూచించారు.
చిత్తూరు జిల్లా పుంగనూరులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఉన్న ఇంటిపై దాడి చేయడం సరైన పద్ధతి కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హితవు పలికారు. గతంలో వైసీపీ ఇదే తరహా దాడులకు పాల్పడిందని అన్నారు. గతంలో వైసీపీ చేసిన తప్పిదాలనే ఇప్పుడు టీడీపీ చేస్తోందని విమర్శించారు. ఒక ఎంపీనే ఊర్లోకి రానివ్వమంటూ ఆయనపైనే కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు వీటిని సరిదిద్దాలని సూచించారు.
భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రామకృష్ణ అన్నారు. పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. నష్టపోయిన రైతన్నలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం అందించాలని కోరారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా నిధులను వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం బాగుపడాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాలని అన్నారు. విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం వీలైనంత తొందరగా అమలు చేయాలని కోరారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YSRCP | టీడీపీ ఎమ్మెల్యే జయరాం వర్గీయుల దౌర్జన్యం.. వైఎస్సార్సీపీ నేత రామాంజనేయరెడ్డి కిడ్నాప్
Road Accident | లారీని ఢీకొట్టిన టెంపో.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం..!
Army Families Killed | లారీ ఢీకొట్టడంతో రెండు ముక్కలైన కారు.. ఆర్మీ కుటుంబాలకు చెందిన ఏడుగురు మృతి
Srinath Maganti | సుశాంత్ స్థానంలో కార్తీక్‌గా మెప్పించిన శ్రీనాథ్ మాగంటి.. ‘ఈఎన్ఈ రిపీట్’తో అద్భుత విజయం!
Sweet Potato | రూ.20కే లభించే ఈ కూరగాయతో ఎంతో ఆరోగ్యం.. చలికాలంలో తప్పక తినాల్సిందే.. ఎందుకంటే..
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

